Header Banner

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలి క్లోజ్డ్ డోర్ మీటింగ్! పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ..

  Tue May 06, 2025 12:02        Politics

ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐరాస భద్రతా మండలి మీటింగులో సభ్య దేశాలు పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే విధంగా.. పాక్ క్షిపణి ప్రయోగాలు చేయటాన్ని సభ్యదేశాలు తప్పుబట్టాయి. పహల్గామ్ దాడులకు పాక్ బాధ్యత వహించాల్సిందేనని అన్నాయి. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి. దాదాపు గంటకు పైగా భద్రతా మండలి మీటింగ్ జరిగింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద చర్చ జరగకుండా ఉండేందుకు పాక్ సభ్యుడు అసిమ్ లిఫ్తికర్ అహ్మద్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన కూడా తెచ్చాడు. ఇండియా యుద్దానికి కాలు దువ్వుతోందని, రెచ్చగొట్టేలా మాట్లాడుతోందని అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సింధు జలాలపై కూడా చర్చ జరిగింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఆపడాన్ని అసిమ్ తప్పుబట్టాడు. నీటిని ఆపడం.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నాడు. అయితే, ఐరాస భద్రతా మండలి మీటింగ్ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia